ఆగ్రహం వ్యక్తం చేసిన సుమ , అనసూయ

Published on Dec 23,2019 09:05 AM

అందాల భామలు సుమ , అనసూయ మీడియా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ భామలకు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... జీఎస్టీ అధికారులు సుమ , అనసూయ ఇండ్లపై అలాగే ఆఫీసులపై దాడులు నిర్వహించారని మీడియాలో వార్తలు రావడమే ! జీఎస్టీ అధికారులు మా ఇండ్లపై దాడులు చేసారని మీడియాలో రాసారు కానీ అది వాస్తవం కాదు , రాసె ముందు తెలుసుకొని రాయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు సుమ , అనసూయ.

మెమెంటో కస్టపడి ఈ స్థాయికి వచ్చామని , అలాంటిది మమ్మల్ని ఎందుకు ఇలా అభాసుపాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. విడివిడిగా ఈ ఇద్దరూ తమపై వచ్చిన వార్తలను ఖండించారు. సుమ తెలుగునాట నెంబర్ వన్ యాంకర్ గా  రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక అనసూయ అటు యాంకర్ గా ఇటు నటిగా రాణిస్తోంది. బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న అనసూయ వెండితెర మీద కూడా సత్తా చాటుతోంది.