టాలీవుడ్ ని అవమానించిన మహేష్ హీరోయిన్

Published on Feb 07,2019 11:45 AM

మహేష్ బాబు తో అథితి చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ అమృతరావు . అయితే ఆ సినిమా తర్వాత ఈ భామ మరే తెలుగు చిత్రంలో కూడా నటించలేదు . అయితే తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఏంటో చెప్పి సంచలనం సృష్టించింది . తెలుగులో సినిమాలు తీసే దర్శకులు హీరోయిన్ లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు ? అందుకే తెలుగు సినిమాల్లో నటించలేదు హీరోయిన్ ని ఒక వస్తువుగా భావిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . 

అతిథి చిత్రంలో మాత్రం నాకు నటించడానికి అవకాశం ఉన్న పాత్ర అందుకే ఆ సినిమా అంగీకరించాను అలాగే మహేష్ అన్నా , మహేష్ ఫ్యామిలీ అన్నా నాకు చాలా ఇష్టం అంటూ చెబుతోంది . టాలీవుడ్ లో నటించలేదు అంటే ఒప్పుకుందాం మరి బాలీవుడ్ లో ఈ భామకేమైనా గొప్ప గొప్ప చిత్రాలు వచ్చాయా ? అంటే అదీలేదు మరి .