అమ్మరాజ్యంలో కడప బిడ్డలు కు లైన్ క్లియర్

Published on Dec 12,2019 12:44 PM

రాంగోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం '' అమ్మరాజ్యంలో కడప బిడ్డలు '' కు మొత్తానికి లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు సూచన మేరకు సెన్సార్ బోర్డు యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది దాంతో ఈరోజు ఈ సినిమా విడుదల అవుతోంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా సినిమాలో చంద్రబాబు , జగన్ , పవన్ కళ్యాణ్ , లోకేష్ , కె ఏ పాల్ లను పోలిన పాత్రలు ఉండటంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయితే ఎన్నో అవాంతరాలు రాగా అన్నింటినీ అధిగమించి సెన్సార్ క్లియరెన్స్ లభించడంతో ఈరోజు విడుదల అవుతోంది అమ్మరాజ్యంలో కడప బిడ్డలు.

ప్రస్తుతం చైనాలో ఉన్న వర్మ త్వరలోనే ఇండియాకు వస్తానని , వచ్చాక నా సినిమాని ఆపాలని చూసిన వాళ్ళ పై పరువు నష్టం దావా వేస్తానని అంటున్నాడు. పొలిటికల్ సెటైరికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో మరికొద్ది గంటల్లోనే తేలనుంది. వర్మ చిత్రాలన్నీ విడుదలకు ముందు వివాదాన్ని సృష్టించడంలో , సంచలనంగా మారడంలో ముందుటాయి అయితే విజయాలు సాధించడంలో మాత్రం వెనుకబడి ఉంటాయి. మరి ఈ సినిమా ఏమౌతుందో !