తెలుగు సినిమా కార్మికుల కోసం అమితాబ్ విరాళం

Published on Apr 18,2020 03:13 PM
తెలుగు సినిమా కార్మికుల కోసం అమితాబ్ బచ్చన్ భారీ విరాళం ప్రకటించాడు. ఏకంగా 12000 బిగ్ బజార్ వోచర్ లను అందించాడు. ఒక్కో కూపన్ విలువ 1500 కాగా 12000 కుటుంబాలకు ఇది పంచనున్నారు. 1500 విలువైన కూపన్ అంటే ఒక కుటుంబానికి దాదాపుగా 20 రోజులకు సరిపడా సరుకులు రావడం ఖాయం. 12000 కూపన్ ల విలువ 1. 8 కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని అమితాబ్ తెలుగు సినిమా కార్మిక కుటుంబాలకు ఇస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి అమితాబ్ కు కృతఙ్ఞతలు తెలిపాడు.

ఇక చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసారు. ఈ చారిటీ నుండి ఇప్పటికే కొంతమందికి సరుకుల పంపిణీ జరిగింది. కరోనా క్రైసిస్ చారిటీ కి హీరోలు పెద్దమొత్తంలోనే విరాళాలు ఇచ్చారు. అయితే హీరోయిన్ లు మాత్రం అంతగా స్పందించలేదు. కరోనా మహామ్మారీ వల్ల షూటింగ్ లన్నీ ఆగిపోవడంతో కార్మికులకు ఇబ్బందులు వచ్చాయి.