అమీ జాక్సన్ కు కొడుకు పుట్టబోతున్నాడట

Published on Aug 28,2019 11:33 AM

తనకు కొడుకు పుట్టబోతున్నట్లు సంతోషంగా ప్రకటించింది అమీ జాక్సన్. పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతున్న అమీ జాక్సన్ యూకే కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయోట్టు ని ప్రేమించింది. అయితే అతడితో డేటింగ్ చేస్తూనే గర్భం దాల్చింది దాంతో మేమిద్దరం ప్రేమలో ఉన్నాం , వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించింది అమీ జాక్సన్. 

వచ్చే నెలలోనే మగబిడ్డకు జన్మనివ్వబోతోంది అమీ జాక్సన్. ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది గ్రీస్ లో బీచ్ సైడ్ వెడ్డింగ్ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది అమీ . అంటే కొడుకు సమక్షంలో తల్లిదండ్రులకు పెళ్లి అన్నమాట ! ఇలాంటి పెళ్లి అందరికీ సాధ్యం కాదుకదా ! అందుకే ఇలా ప్లాన్ చేసి ఉంటుంది అమీ జాక్సన్.