మద్యం పార్టీలో రెచ్చిపోయిన అమీషా పటేల్

Published on Nov 27,2019 12:43 PM

హాట్ భామ అమీషా పటేల్ మద్యం పార్టీలో తన ఫ్రెండ్స్ తో కలిసి వీర లెవల్లో రెచ్చిపోయింది. 43 సంవత్సరాల అమీషా పటేల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోల సరసన నటించింది అయితే తెలుగులో మాత్రం పెద్దగా బ్రేక్ రాలేదు ఈ భామకు అలాగే హిందీలో కూడా పలు చిత్రాల్లో కూడా నటించింది కానీ అక్కడ కూడా స్టార్ డం అందుకోలేకపోయింది.

తాజాగా ఈ భామ చేతిలో పెద్దగా సినిమాలు లేకుండాపోయాయి. ఇక అప్పటి నుండి ఈ భామ ఇలా మద్యం పార్టీలో పాల్గొంటూ ఇలా వీరంగం వేస్తోంది. పబ్ కల్చర్ కు బాగా అలవాటు పడిన ఈ భామ సందు దొరికితే చాలు పెగ్ లు వేస్తూ స్వర్గంలో తేలియాడుతోంది. తాజాగా ఈ భామ మద్యం పార్టీ చేసుకుంటూ రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.