విడాకులకు ధనుష్ కారణం కాదంటున్న అమలా పాల్

Published on Feb 18,2020 07:16 PM

మా విడాకులకు హీరో ధనుష్ కారణం కాదని , అతడు నా మంచి కోరుకునే మంచి వ్యక్తి అని అతడ్ని వెనకేసుకు వస్తోంది హీరోయిన్ అమలా పాల్. దర్శకులు ఏ ఎల్ విజయ్ - అమలా పాల్ విడాకులు తీసుకోవడానికి కారణం హీరో ధనుష్ అని విజయ్ తండ్రి అళగప్పన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు చేసి దాదాపు మూడు వారాలు అవుతోంది కానీ అమలా పాల్ మాత్రం అప్పుడు స్పందించలేదు. కట్ చేస్తే ఇప్పుడు స్పందించింది కానీ అందుకు కారణం ధనుష్ కాదని స్పష్టం చేసింది.

ధనుష్ - అమలా పాల్ ఇద్దరు కూడా సినిమాల్లో నటించారు. అలాగే ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో సాగుతోందని గుసగుసలు వినిపించాయి. అయితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అంటోంది అమలా పాల్. ఇక మాజీ భర్త ఏ ఎల్ విజయ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కానీ అమలా పాల్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయాన్నీ అడిగితే నా పెళ్లి ఎప్పుడు అనేది నేనే చెబుతాను అంటూ తప్పించుకుంది. అమలా పాల్ కూడా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.