రివేంజ్ డ్రామాగా అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రం

Published on Nov 23,2019 03:29 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ గా విభిన్న పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ చిత్రాన్ని రివేంజ్ డ్రామాగా తెరకెక్కించనున్నాడట దర్శకులు సుకుమార్. నాన్నకు ప్రేమతో , రంగస్థలం , 1 నేనొక్కడినే చిత్రాలను రివేంజ్ డ్రామాగా తెరకెక్కించాడు సుకుమార్.

అయితే ఆ మూడు చిత్రాలు కూడా మరో కోణంలో సాగుతాయి కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగుతుందట అలాగే సెంటిమెంట్ కూడా పుష్కలంగా ఉందట. యాక్షన్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను థాయిలాండ్ లో చేయాలనే ఆలోచన చేస్తున్నారట సుకుమార్. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.