భారీ రేట్లకు అమ్ముడుపోయిన అల్లు అర్జున్ చిత్రం

Published on Sep 05,2019 08:42 AM

తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో '' అల .... వైకుంఠపురములో '' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్ర శాటిలైట్ , డిజిటల్ రైట్స్  సొంతం చేసుకోవడానికి పలువురు పోటీపడగా జెమిని టివి శాటిలైట్ రైట్స్ ని ఫ్యాన్సీ ఆఫర్ కు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటల్ రైట్స్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది.
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయాలు సాధించడమే కాకుండా బుల్లితెరపై కూడా మంచి ఆదరణ పొందాయి దాంతో ఈ అల ..... వైకుంఠపురములో చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రలో టబు నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.