రికార్డుల మోత మోగిస్తున్న అల్లు అర్జున్ టీజర్

Published on Dec 12,2019 12:39 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల ....... వైకుంఠపురములో చిత్ర టీజర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆ టీజర్ అలా విడుదల అవ్వడమే ఆలస్యం యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కేవలం 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ని సాధించిన ఏకైక తెలుగు చిత్రంగా నిలిచిందని ప్రకటించారు ఆ చిత్ర బృందం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల కాగా అందులో రెండు పాటలు యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టించాయి. దాంతో ఈ టీజర్ పై కూడా అంచనాలు పెరిగాయి.

ఇక టీజర్ విషయానికి వస్తే ....... ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ , సెంటిమెంట్ కలగలిపి ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఈ అల ...... వైకుంఠపురములో. కొత్త ఏడాది 2020 జనవరి 12 న ఈ చిత్రం విడుదల కానుంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో టబు చాలాకాలం తర్వాత తెలుగు చిత్రంలో నటించడం.