యుట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న అల్లు అర్జున్

Published on Nov 13,2019 05:56 PM

ఇటీవలే విడుదలైన '' రాములో రాములా '' అనే పాట యుట్యూబ్ ని అల్లల్లాడిస్తోంది. ఏ నోటా విన్నా ....... ఏ సెల్ ఫోన్ లో చూసినా ...... ఏ ఫంక్షన్ వద్ద చూసినా '' రాములో రాములా '' అనే పాట అందరినీ ఉర్రూతలూగిస్తోంది. కుర్రాళ్లకు , ప్రేమికులకు ఈ పాట విశేషంగా నచ్చుతోంది దాంతో యుట్యూబ్ లో ఈ పాటకు ఏకంగా 45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది రికార్డ్ కాగా అది 50 మిలియన్ల ని ఈజీగా దాటేలా ఉంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో '' అల ...... వైకుంఠపురములో '' అనే చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రాములో రాములా అనే సూపర్ హిట్ పాటని చిత్రంలోని తారాగణం అంతా పాల్గొనగా చిత్రీకరించారు త్రివిక్రమ్. ప్రస్తుతం ప్యారిస్ లో సామజవరగమనా అనే పాట కోసం అల్లు అర్జున్ - పూజా హెగ్డే తో వెళ్ళాడు త్రివిక్రమ్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 12 న విడుదల చేయనున్నారు.