ఓవర్సీస్ లో కూడా మంచి రేటు రాబట్టిన అల్లు అర్జున్

Published on Nov 18,2019 04:43 PM

అల్లు అర్జున్ తాజాగా అల వైకుంఠపురములో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన సామజవరగమనా , రాములో రాములా పాటలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. తమన్ అందించిన రెండు పాటలు కూడా పెద్ద హిట్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దాంతో ఈ సినిమా హక్కుల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది.

ఓవర్సీస్ లో ఈ సినిమా కోసం పోటీ పడి 8కోట్ల 50 లక్షలకు హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే హిందీ డబ్బింగ్ , డిజిటల్ రైట్స్ కోసం 19 కోట్లకు పైగా రేటు పలికిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడేమో ఓవర్సీస్ రేటు కూడా పెద్ద మొత్తంలో పలకడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.