ప్లాప్ డైరెక్టర్ తో అల్లు శిరీష్

Published on Dec 07,2019 05:53 PM

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా సక్సెస్ కావాలని పాపం కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు అయితే ఇప్పటివరకు కమర్షియల్ హిట్ ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. హీరోగా అన్ని రకాల ప్రయత్నాలు చేసాడు కానీ సక్సెస్ అన్నది మాత్రం అందని ద్రాక్ష అవుతోంది పాపం ఈ హీరోకు. ఒకవైపు అన్నయ్య అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యాడు కానీ అల్లు శిరీష్ మాత్రం సక్సెస్ నే అందుకోలేక పోతున్నాడు.

తాజాగా ఈ హీరో మరో ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన '' విజేత '' చిత్రానికి దర్శకత్వం వహించిన రాకేష్ శశి తో అల్లు శిరీష్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. విజేత చిత్రం ఆల్రెడీ ప్లాప్ అయ్యింది , మళ్ళీ అలాంటి ప్లాప్ డైరెక్టర్ తో సినిమా అంటే అల్లు శిరీష్ మళ్ళీ రిస్క్ చేస్తున్నట్లే.