85 కోట్ల షేర్ రాబడితే అల్లు అర్జున్ హిట్ కొట్టినట్లే !

Published on Jan 08,2020 06:18 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో చిత్రం 85 కోట్ల షేర్ రాబడితే హిట్ కొట్టినట్లే ! బయ్యర్లు సేఫ్ అయినట్లే ! దాంతో 85 కోట్ల షేర్ రాబట్టే బాధ్యత ఈ హీరో మీద ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ స్వరపరిచిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కుర్రకారు అల వైకుంఠపురములో పాటలు పాడుతూ పరవశించి పోతున్నారు అంతగా ఆకట్టుకుంటున్నాయి అల వైకుంఠపురములో పాటలు. ఇప్పటికే మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ కావడంతో సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు.

ఈ సినిమాని అన్ని ఏరియాలు కలిపి 84.46 కోట్లకు థియే ట్రికల్ రైట్స్  కొన్నారు బయ్యర్లు. అంటే 85 కోట్ల షేర్ వస్తే హిట్ అయినట్లే. సంక్రాంతి తెలుగువాళ్ళకు పెద్ద పండగ కాబట్టి దాదాపు వారము రోజుల పాటు పండగ వాతావరణం నెలకొనడం ఖాయం దాంతో అవలీలగా ఈ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా టబు , సుశాంత్ , నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. జనవరి 12న విడుదల కానున్న అల వైకుంఠపురములో చిత్రం కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.