అల్లు అర్జున్ భార్య చాలా స్ట్రిక్ట్ అంట !

Published on Mar 12,2020 06:22 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహా రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు దాంతో చాలా సంతోషంగా ఉంటున్నారు అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి లు. అయితే ఒక విషయంలో మాత్రం స్నేహా తనని బాగా ఇబ్బంది పెట్టేస్తోందని అంటున్నాడు అల్లు అర్జున్. ఇంతకీ స్నేహ పై  అల్లు అర్జున్  కు ఉన్న ఫిర్యాదు ఏంటో తెలుసా ....... వాట్సాప్ అంతా చెక్ చేస్తుందట స్నేహారెడ్డి.

తన మొబైల్ ని తీసుకొని అందులో వాట్సాప్ చెక్ చేస్తుందని అదే నాకున్న కంప్లైంట్ అని అంటున్నాడు అల్లు అర్జున్. మా ఆమధ్య ఎలాంటి అరమరికలు లేవు , తనపై నాకు రోజురోజుకి ప్రేమ ఎక్కువ అవుతోంది తప్పితే తగ్గడమే లేదని అంటున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఈ హీరో సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు అల్లు అర్జున్.