మళ్ళీ ఆ భామే కావాలంటున్న అల్లు అర్జున్

Published on Mar 02,2019 02:16 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రంలో ఒక హీరోయిన్ గా కేథరిన్ ట్రెసా ని తీసుకోవాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్ అంతేకాదు దర్శకులు త్రివిక్రమ్ కు కూడా చెప్పాడట కేథరిన్ ని తీసుకోవాలని . ఇంతకుముందు కేథరిన్ ట్రేసా తో మూడు సినిమాలు చేసాడు అల్లు అర్జున్ . ఆ మూడు సినిమాలు  ఇద్దరమ్మాయిలతో , సరైనోడు , రుద్రమదేవి చిత్రాలు కాగా సరైనోడు , రుద్రమదేవి చిత్రాలు హిట్స్ అయ్యాయి. 

పైగా అల్లు అర్జున్ కు కేథరిన్ కు మంచి కెమిస్ట్రీ కూడా కుదిరింది అందుకే నాలుగోసారి కేథరిన్ తో రొమాన్స్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట ఈ  హీరో . అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా ఆ రెండు కూడా హిట్ అయ్యాయి . దాంతో ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది .