డా బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

Published on Feb 07,2019 04:18 PM

ఇటీవలే హార్ట్ సర్జరీ చేయుంచుకొన్న డా బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్ ఆయన మునుపటి వలె చురుకుగా సినిమాలు చేయాలనీ చేస్తారు అని  అభిలాషించిన అల్లు అర్జున్.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందంని పరామర్శించాడు . బ్రహ్మానందంకు  గత నెలలో హార్ట్ ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే . ముంబై లో ఈ ఆపరేషన్ జరిగింది , కాగా ప్రస్తుతం బ్రహ్మానందం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు కాగా అతడ్ని పరామర్శించాడు అల్లు అర్జున్ . మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని , సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించాడు బ్రహ్మానందం . 

టాలీవుడ్ లో టాప్ మోస్ట్ పాపులర్ కమెడియన్ అయిన బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు . అయితే గత నెలలో అనారోగ్యానికి గురి కావడంతో హార్ట్ సర్జరీ జరిగింది . ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ...... త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .