ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్

Published on Apr 02,2019 01:52 PM

ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు . దర్శకులు సుకుమార్ మహేష్ బాబు కోసం రాసుకున్న ఈ కథ మహేష్ బాబు కి నచ్చలేదు దాంతో అల్లు అర్జున్ తో ఈ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు సుకుమార్ . ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించనున్నాడు . ఇప్పటికే రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ మెప్పించిన విషయం తెలిసిందే . 

దాంతో ఆ పాత్రకు అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతాడని ఫిక్స్ అయ్యాడట సుకుమార్ . అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు . ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అంటే 2020 లో అన్నమాట ! అప్పటి వరకు సుకుమార్ వెయిట్ చేయాల్సిందే అల్లు అర్జున్ కోసం .