అభిమాని చనిపోవడంతో అల్లు అర్జున్ టీజర్ వాయిదా

Published on Dec 09,2019 12:41 PM

మెగా అభిమాని నూర్ చనిపోవడంతో అల్లు అర్జున్ నటించిన '' అల ...... వైకుంఠపురములో '' చిత్ర టీజర్ ని విడుదల చేయకుండా వాయిదా వేశారు. మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అయిన నూర్ చనిపోవడంతో అల వైకుంఠపురములో చిత్ర టీజర్ ని వాయిదా వేశారు. మాములుగా అయితే టీజర్ రెడీ అయిపొయింది ఇక విడుదల చేయడమే ఆలస్యం అని అనుకుంటున్న సమయంలో ఇలా విషాదం చోటు చేసుకుంది.

అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అల వైకుంఠపురములో చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. అద్భుతమైన తమన్ ట్యూన్స్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి.