అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా ప్రారంభమైంది

Published on Oct 30,2019 04:15 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ ల సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రారంభమైంది. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ - అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు ఆర్య వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది , కట్ చేస్తే ఆర్య 2 కూడా చేసారు కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇక ఇప్పుడేమో ముచ్చటగా మూడో సినిమా ఈ కాంబినేషన్ లో వస్తోంది. అసలు ఈ చిత్రాన్ని హీరో మహేష్ బాబు చేయాల్సి ఉండే కానీ మహేష్ బాబు కి సుకుమార్ కు వచ్చిన తేడాలతో అల్లు అర్జున్ ఈ సినిమాని తన్నుకుపోయాడు. ఇక ఈరోజు ఈసినిమా ప్రారంభమైంది. అల్లు అర్జున్ కు ఇది 20 వ సినిమా కావడం విశేషం.