అల్లు అర్జున్ ని బాధపెడుతున్న ఫ్యాన్స్

Published on Feb 03,2020 06:55 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల తీరుతో చాలా బాధపడుతున్నాడట. ఈ విషయాన్నీ తానే స్వయంగా చెప్పడం విశేషం. ఇంతకీ అల్లు అర్జున్ బాధపడుతోంది ఎందుకో తెలుసా ........ అల ...... వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ ఒక పాటలో బీడీ తాగుతూ కనిపిస్తాడు. అది ఆ పాటలో స్టైలిష్ గా ఉంది దాంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా బీడీ తాగుతూ , సిగరెట్ తాగుతూ ఆ పాటలో నటిస్తున్నారు. అంతేనా ఆ పాట ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసి హల్చల్ చేస్తున్నారు.

ఆ వీడియోలు చూసిన అల్లు అర్జున్ చాలా బాధపడుతున్నాడట. నేను సిగరెట్లు కానీ బేడీలు కానీ తాగను కానీ సినిమా కోసం అలా చేయాల్సి వచ్చింది. అంతేకాని నాకు ఆ అలవాటు లేదని , మీరు కూడా ధూమపానం చేయొద్దని దాని వాళ్ళ రోగాల బారిన పడతారని అంటున్నాడు అల్లు అర్జున్. జనవరి 12 న విడుదలైన అల ..... వైకుంఠపురములో సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వారాలు దాటినప్పటికీ ఇంకా మంచి వసూళ్ల నే సాధిస్తున్నాడు అల్లు అర్జున్.