సైరా నరసింహారెడ్డి లో అల్లు అర్జున్

Published on Feb 13,2019 11:12 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించడం ఖాయమైపోయింది . మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , జగపతిబాబు , నయనతార , తమన్నా , విజయ్ సేతుపతి , సుదీప్  తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ జాబితాలో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేరుతున్నాడు . 

అల్లు అర్జున్ చేత అథితి పాత్ర చేయించాలని భావించాడట దర్శకులు సురేందర్ రెడ్డి . దానికి చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా ఒప్పుకోవడంతో అల్లు అర్జున్ ఎంటర్ అవుతున్నాడు సైరా లో . ఇంతకుముందు అల్లు అర్జున్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రేసుగుర్రం వంటి సూపర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే .