అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే !

Published on Apr 15,2020 04:28 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత జరుగనుంది. అయితే ఈ సినిమా అసలు చేయాల్సింది హీరో మహేష్ బాబు కానీ సుకుమార్ కు మహేష్ బాబు కు ఎక్కడో తేడా కొట్టింది దాంతో మహేష్ రిజెక్ట్ చేస్తే ఇదే కథని అల్లు అర్జున్ ఓకే చేసాడు. అలాగే కొన్ని హిట్ చిత్రాలను అలాగే కొన్ని ప్లాప్ చిత్రాలను కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసాడు. ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం.

నితిన్ హీరోగా నటించిన జయం చిత్రం అసలు అల్లు అర్జున్ నటించాలి కానీ అప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు గంగోత్రితో దాంతో జయం ని నిరాకరించాడు కట్ చేస్తే జయం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే రవితేజ నటించిన భద్ర సినిమా కూడా అల్లు అర్జున్ చేయాల్సి ఉంది. కథ నాకు సెట్ కాదని అంటే అది రవితేజ ని వరించింది భద్ర కూడా పెద్ద హిట్టే. 100 పర్సెంట్ లవ్ , పండగ చేస్కో, అర్జున్ రెడ్డి , గ్యాంగ్ లీడర్, ఒక లైలాకోసం , కృష్ణాష్టమి , అరవింద సమేత , డిస్కో రాజా , గీత గోవిందం చిత్రాలు అల్లు అర్జున్ వే ! అయితే అందులో కొన్ని హిట్స్ అలాగే కొన్ని ప్లాప్ లున్నాయి. రాసి పెట్టివుంటే అవి వస్తాయి లేదంటే ఎన్ని చేసినా రావు. మరి ఈ పుష్ప చిత్రం ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.