విజయ్ దేవరకొండ హీరోయిన్ని పట్టిన అల్లు అర్జున్

Published on Feb 07,2019 12:13 PM

విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్న భామ రష్మిక మందన్న . ఆ సినిమా తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ తోనే డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది ఈ భామ . కాగా రష్మిక మందన్న ని తన తదుపరి సినిమాలో బుక్ చేసుకున్నాడట అల్లు అర్జున్ . తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . 

కాగా ఆచిత్రంలో ఒక హీరోయిన్ గా రష్మిక మందన్న ని తీసుకోవాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడట దాంతో అల్లు అర్జున్ కూడా రష్మిక మందన్న తో రొమాన్స్ చేయడానికి సై అన్నాడట . అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తే తప్పకుండా ఈ భామ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం .