అల్లు అర్జున్ పుష్ప స్టోరీ లీక్

Published on May 02,2020 11:37 AM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. దానికి ఊతమిచ్చేలా వదిలిన ఫస్ట్ లుక్ తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడేమో ఏకంగా పుష్ప స్టోరీ లీక్ అయ్యింది. ఈ లీక్ అయిన కథనం ప్రకారం ఇలా ఉంది .  '' సినిమా ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో సాగుతుంది. చిన్న వయసులోనే కుటుంబం నుండి దూరం అవుతాడు , ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్ గా మారి కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తాడట పుష్పరాజ్.

కోట్ల కొద్దీ డబ్బు సంపాదించిన తర్వాత తన వాళ్ళని కలుసుకోవడానికి వచ్చిన పుష్పరాజ్ కు అక్కడ తనవాళ్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? తన వాళ్ళకోసం పుష్పరాజ్ ఏం చేసాడు అన్నదే కథాంశంగా రూపొందిందని , అయితే కథ సాధారణంగా ఉన్నప్పటికీ అనేక ట్విస్ట్ లతో సాగుతుందని , భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. అంటే మొత్తంగా ఇది రివేంజ్ డ్రామా అన్నమాట