దర్శకులకు పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

Published on Feb 04,2020 08:12 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల .... వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో సంతోషంలో టాలీవుడ్ లోని పలువురు దర్శకులకు పెద్ద ఎత్తున మందు పార్టీ ఇచ్చాడు. ఆ మందు పార్టీకి టాలీవుడ్ కు చెందిన పలువురు దర్శకులు ఈ పార్టీలో పాల్గొని అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు ఆ పార్టీని బాగా ఆస్వాదించారు కూడా. ఈ పార్టీలో చాలామంది పాల్గొన్నారు కానీ అనిల్ రావిపూడి మాత్రం పాల్గొనలేదు.

అనిల్ రావిపూడి ఈ పార్టీలో పాల్గొనకపోవడానికి కారణం అల్లు అర్జున్ ఆహ్వానించకపోవడమే అని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో మహేష్ సినిమా , అల్లు అర్జున్ సినిమా పోటీ పడటంతో ఉప్పు - నిప్పులా అయ్యింది పరిస్థితి దాంతో ఈ పార్టీకి అనిల్ రావిపూడిని పిలవలేదని సమాచారం.