విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్

Published on Jan 08,2020 11:09 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అర్జున్ రెడ్డి లాంటి చిత్రం నేను అయితే చేసేవాడ్ని కాదు , విజయ్ దేవరకొండ కాబట్టి చేసాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు అల్లు అర్జున్. అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న చిత్రం ఈ అర్జున్ రెడ్డి దాంతో ఆ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కూడా. అయితే విమర్శలు ఏ స్థాయిలో అయితే వచ్చాయో అంతకంటే ఎక్కువగా క్రేజ్ వచ్చింది విజయ్ దేవరకొండకు అలాగే దర్శక నిర్మాతలకు పేరు డబ్బులు వచ్చాయి.

విజయ్ దేవరకొండ వేసుకునే బట్టలు కూడా ఇష్టమట అల్లు అర్జున్ కు దాంతో తనకు కూడా కొన్ని కాస్ట్యూమ్స్ పంపించాలని కోరగా రకరకాల డిజైన్ లలో కొన్ని కాస్ట్యూమ్స్ పంపించాడట విజయ్ దేవరకొండ. అయితే ఆ బట్టలను వేసుకోకుండా అలానే ఇంట్లో పెట్టాడట అల్లు అర్జున్. అంటే పంపించమని కోరడం ఎందుకు ? వాటిని ట్రై చేయకుండా పక్కన పెట్టడం ఎందుకో ?