మురుగదాస్ తో అల్లు అర్జున్

Published on Jan 31,2019 05:33 PM

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా నటించడానికి సిద్దమైన అల్లు అర్జున్ ప్రముఖ తమిళ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . ఇంతకుముందు మురుగదాస్ చిరంజీవి తో  స్టాలిన్ చిత్రం చేసాడు . ఆ తర్వాత అల్లు అరవింద్ హిందిలో నిర్మించిన గజిని చిత్రానికి దర్శకత్వం వహించాడు . అలా మెగా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో అల్లు అర్జున్ తో సినిమా సెట్ అయ్యింది . 

అల్లు అర్జున్ కూడా చాలా రోజులుగా మురుగదాస్ తో సినిమా చేయాలనీ ఉబలాటపడుతున్నాడు అయితే అది ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది . ఈ సంవత్సరం ఆఖరున సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అరవింద్ . ఇప్పటికే అల్లు అర్జున్ కు తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే . మురుగదాస్ తో సినిమా చేయడం వల్ల జాతీయ స్థాయిలో అలాగే తమిళనాడులో కూడా మంచి మార్కెట్ ఏర్పడనుంది .