బాహుబలి జలపాతం దగ్గరే అల్లు అర్జున్ సినిమా

Published on Dec 28,2019 12:06 PM

బాహుబలి చిత్రంలో అద్భుతమైన జలపాతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ సుందర జలపాతం ఉంది. బాహుబలి చిత్రానికి ఈ జలపాతం కూడా ఒక హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అదే జలపాతం దగ్గర అల్లు అర్జున్ సినిమా షూటింగ్ జరుగుతోందట! పైగా ఆ జలపాతం దగ్గర అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడట దర్శకులు సుకుమార్. అల వైకుంఠపురములో చిత్రం విడుదల కాకముందే సుకుమార్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కేరళలో దట్టమైన అడవిలో అల్లు అర్జున్ - సుకుమార్ ల చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నాడు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలం క్రితం గంధపు చెక్కల కోసం చెట్లని పెద్ద ఎత్తున నరుకుతున్న విషయం సంచలనం సృష్టించింది. కట్ చేస్తే అదే కథాంశానికి రివేంజ్ డ్రామాని యాడ్ చేసి ఈ సినిమా చేస్తున్నాడు సుకుమార్.