బాలీవుడ్ పై కన్నేసిన అల్లు అర్జున్

Published on Feb 04,2020 07:38 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల .... వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అల ..... వైకుంఠపురములో చిత్రంతో తిరుగులేని వసూళ్ళని సాధించడంతో ఇక ఈ హీరో బాలీవుడ్ పై కన్నేశాడు. హిందీలో సినిమా చేయాలనీ నాకు ఉంది అయితే అందుకు తగ్గ కథ , దర్శకుడు , నిర్మాత సెట్ అయితేనే చేయాలి అంతేకాని బాలీవుడ్ లో చేయాలని ఏదో చేస్తే కరెక్ట్ కాదని అంటున్నాడు.

సంజయ్ లీలా భన్సాలీ , ఆనంద్ రాయ్ , రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకుల పని తీరుని ఇష్టపడతానని , అయితే రాజ్ కుమార్ హిరానీ తో నా మొదటి బాలీవుడ్ చిత్రం చేయాలనీ ఉందని అంటున్నాడు అల్లు అర్జున్. అంటే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ పై పెద్ద ప్లానే వేస్తున్నాడన్న మాట. బాలీవుడ్ లో కూడా నటించడం వల్ల తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.