దసరాకు పోటీ పడనున్న అల్లు అర్జున్

Published on Feb 11,2020 05:00 PM

ఈసారి సంక్రాంతి కి పోటీ పడి సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్ ఈ ఏడాది దసరాకు మళ్ళీ పోటీ పడటానికి రెడీ అవుతున్నాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా ఊర మాస్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పండగ సెలవుల్లో సరైన సినిమా వస్తే ఎలా దున్నుకోవచ్చో అల ..... వైకుంఠపురములో చిత్రంతో నిరూపించాడు అల్లు అర్జున్.

దాంతో ఈసారి దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారట ఆ చిత్ర బృందం. దసరాకు తెలంగాణలో పది రోజులకు పైగా సెలవులు ఇస్తారు దాంతో నైజాం లో రికార్డ్ స్థాయి వసూళ్ళని సాధించొచ్చు అన్న ధీమాలో ఉన్నారట. ఇప్పటికి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తయ్యింది . త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలిపి విజయదశమి అంటే ఏంటో చూపిద్దాం అని ఛాలెంజ్ గా ఉన్నాడట అల్లు అర్జున్.