అల్లు అర్జున్ దే పైచేయి అయిందిగా

Published on Feb 02,2020 02:30 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు అల .... వైకుంఠపురములో చిత్రంతో. సంక్రాంతి పోరులో సూపర్ స్టార్ మహేష్ బాబు - అల్లు అర్జున్ లు పోటీ పడిన విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11 న విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించగా జనవరి 12 న అల .... వైకుంఠపురములో చిత్రం విడుదలై భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. దాంతో సంక్రాంతి విన్నర్ మేమంటే కాదు మేమే అంటూ పోటీ పడ్డారు. రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లని సాధించాయి.

అయితే తుది పోరులో మాత్రం మహేష్ బాబు కంటే అల్లు అర్జున్ దే పైచేయి అయ్యింది. అల ..... వైకుంఠపురములో చిత్రానికి అల్లు అర్జున్ యాక్టింగ్ తో పాటుగా తమన్ అందించిన పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి దాంతో అల .... వైకుంఠపురములో చిత్రానికి కాస్త మొగ్గు ఎక్కువ కనిపించింది. మహేష్ బాబు సినిమా కంటే అల్లు అర్జున్ సినిమా ఎక్కువ వసూళ్లు సాధించి ఆధిపత్యాన్ని సాధించాడు.