మహేష్ పై సెటైర్లు వేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Published on Dec 03,2019 02:33 PM

మహేష్ బాబు పై విమర్శలు చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలోంచి మైండ్ బ్లాంక్ అనే విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆ పాట అంతగా బాగోలేదని విమర్శలు చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్. మైండ్ బ్లాంక్ అనే పాట బాగానే ఉన్నప్పటికీ మహేష్ యాంటీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో లేదు అందుకే మా పాట అంత హిట్ కాలేదు అంటూ సంతోషపడుతున్నారు.

అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రం లోని రెండు పాటలు సామజవరగమనా , రాములో రాములా పాటలు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి అయితే ఆ స్థాయిలో అయితే మైండ్ బ్లాంక్ అనే పాట అయితే లేదు. దాంతో అల్లు అర్జున్ పాటలతో పోల్చుతూ పండగ చేసుకుంటూ మహేష్ బాబు పై సెటైర్ లు వేస్తున్నారు. అల్లు అర్జున్ చిత్రానికి తమన్ సంగీతం అందించగా మహేష్ బాబు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.