ఆ హీరోయిన్ ని వద్దంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Published on Jan 17,2020 08:26 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్న ని ఎంపిక చేసారు దర్శకులు సుకుమార్. అయితే రష్మిక మందన్న ని అల్లు అర్జున్ సరసన వద్దని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. రష్మిక మందన్న చిన్న హీరోలకు హీరోయిన్ గా సెట్ అవుతుందని కానీ స్టార్ హీరోలకు అందునా అల్లు అర్జున్ లాంటి హీరోకు సెట్ కాదని అందుకే తక్షణమే ఆమెని పక్కన పెట్టి మరో హీరోయిన్ ని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 అల వైకుంఠపురములో చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో ఉన్నాడు హీరో అల్లు అర్జున్. ఇక సుకుమార్ దర్శకత్వంలో స్మగ్లర్ గా నటించనున్నాడు ఈ హీరో. అయితే హీరోయిన్ గా రష్మిక మందన్న ని ఎంపిక చేయడంతో ఆమెని తప్పించి మరొకరిని పెట్టండి అంటూ గోల చేసున్నారు కొంతమంది ఫ్యాన్స్. కానీ సుకుమార్ వాళ్ళని పట్టించుకునే అవకాశం లేకుండా మేకింగ్ కి రెడీ అయిపోతున్నాడు.