నిరాశలో అల్లు అర్జున్ ఫ్యాన్స్

Published on Dec 18,2019 09:37 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్  ఇంతటి నిరాశకు గురి కావడానికి కారణం ఏంటో తెలుసా ........ బుట్ట బొమ్మ అనే పాట. ఈరోజు బుట్ట బొమ్మ అనే పాటని విడుదల చేస్తామని ఘనంగా ప్రకటించారు కట్ చేస్తే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈరోజు బుట్ట బొమ్మ అనే పాట ని విడుదల చేయలేకపోతున్నారు దాంతో ఈ విషయాన్నీ అధికారికంగా ట్వీట్ చేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు బన్నీ ఫ్యాన్స్. ఇక వీళ్ళు కూడా బాగా ఆశగా ఆ పాట కోసం ఎదురు చూడటానికి కారణం ఏంటో తెలుసా ....... ఇంతకుముందు విడుదలైన రెండు పాటలు కూడా ప్రభంజనం సృష్టించడమే !

అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల .... వైకుంఠపురములో అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి 3 పాటలు విడుదల కాగా ఆ మూడు పాటల్లో రెండు పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ పాట కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు కాదు మల్లీ ఎప్పుడు అనేది తెలియజేస్తాం అని ప్రకటించడంతో నిరాశ చెందారు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.