ఓ మై గాడ్ డాడీ పాటతో అలరిస్తున్న అల్లు అర్జున్

Published on Nov 23,2019 12:02 PM

నిన్న సాయంత్రం అల వైకుంఠపురములో చిత్రంలోని ఓ మై గాడ్ డాడీ అనే పాటని విడుదల చేసారు. కాగా ఈ పాట అల్లు అర్జున్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో చిత్రంలోని రెండు పాటలు ఇంతకుముందు విడుదలై ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. '' సామజవరగమనా '' , '' రాములో రాములా '' ఈ రెండు పాటలు కూడా యూట్యూబ్ ని షేక్ చేసాయి.

అయితే ఈ మూడో పాట కూడా బాగానే ఉన్నప్పటికీ ఆ రెండు పాటల స్థాయిలో అయితే లేదు. ఇక ఈ పాట విశేషం ఏంటంటే ఆమధ్య అల్లు అర్జున్ కూతురు , కొడుకు ఇద్దరు కూడా ఓ మై గాడ్ డాడీ అనే పాట కు డ్యాన్స్ చేసి ఆశ్చర్యపోయేలా చేసారు. బన్నీ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తారు ఈ పాటతో. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 12 న విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో టబు నటించింది.