అల్లు అర్జున్ ని బే అని తిట్టిన కూతురు

Published on Mar 02,2020 06:30 PM

తండ్రి అల్లు అర్జున్ ని బే అని తిట్టి సంచలనం సృష్టించింది కూతురు అర్హ . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇద్దరు సంతానం అన్న సంగతి తెలిసిందే. ఒక కొడుకు అలాగే ఒక కూతురు. అయితే కూతురు చిన్నమ్మాయి పైగా చాలా యాక్టివ్ కావడంతో ఆమెతో సరదాగా ఆదుకుంటుంటాడు అల్లు అర్జున్. ఆమెకు రకరకాల తిట్లు కూడా నేర్పిస్తున్నాడు. కూతురు ముద్దు ముద్దుగా తిడుతుంటే ఆ తిట్ల ని వింటూ పరవశించి పోతున్నాడు అల్లు అర్జున్.

తాజాగా బే అని తిట్టి సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ కూతురు అర్హ తో సరదాగా ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకుముందు కూడా రాములో రాములా అనే పాట డ్యాన్స్ ఎలా ఉందని అడిగితె అది డ్యాన్సా ...... దోష తిప్పేసే డ్యాన్స్ అంటూ అల్లు అర్జున్ కు చురకలు అంటించింది చిన్నారు అర్హ. అల ..... వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హాలిడేస్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు.