ఓవర్ సీస్ లో మహేష్ ని దాటేసిన అల్లు అర్జున్

Published on Jan 18,2020 02:42 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓవర్ సీస్ లో మహేష్ బాబు ని అధిగమించాడు. అల వైకుంఠపురములో చిత్రంతో 2 మిలియన్ డాలర్ల వసూళ్ళని సాధించి మహేష్ బాబు పై చేయి సాధించాడు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న విడుదల కాగా అల్లు అర్జున్ నటించిన అల ..... వైకుంఠపురములో జనవరి 12 న విడుదల అయ్యింది. ఒక్క రోజు తేడాలో విడుదలైన ఈ చిత్రాలతో తీవ్ర పోటీ నెలకొంది. మా సినిమా బ్లాక్ బస్టర్ అంటే లేదు లేదు మా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు.

అయితే ఓవర్ సీస్ లో మాత్రం అల్లు అర్జున్ పైచేయి సాధించాడు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది కానీ ఇంకా 2 మిలియన్ క్లబ్ లో చేరలేదు అదే అల్లు అర్జున్ సినిమా మాత్రం 2 మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా ఓవర్ సీస్ లో రెండున్నర మిలియన్ డాలర్లని వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.