అల్లు అర్జున్ కు సవాల్ విసురుతున్న మహేష్

Published on Oct 27,2019 03:16 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లు అర్జున్ కు సవాల్ విసురుతున్నాడు. అల్లు అర్జున్ నటించిన అల ..... వైకుంఠపురములో చిత్రం 2020 జనవరి 12 న విడుదల అవుతుండగా అదే రోజున మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాస్ హీరో కాబట్టి అందునా త్రివిక్రమ్ దర్శకుడు కాబట్టి మహేష్ బాబు సినిమా తప్పకుండా వాయిదా పడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఆ ప్రచారానికి తెరదించుతూ 2020 జనవరి 12 న మా సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతోంది అంటూ మరోసారి స్పష్టం చేసారు దాంతో అల్లు అర్జున్ - మహేష్ బాబు ల మధ్య భీకరపోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్ బాబు కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే మాస్ ప్రేక్షకులు తక్కువ దాంతో మహేష్ వెనకడుగు వేస్తాడేమో అని అనుకున్నారు కానీ దీపావళి సందర్బంగా అల్లు అర్జున్ కు సవాల్ విసిరాడు మహేష్ బాబు.