మహేష్ బాబుకు సవాల్ విసురుతున్న అల్లు అర్జున్

Published on Dec 10,2019 02:35 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కు సవాల్ విసురుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాంతో మహేష్ బాబు తెగ కష్టపడుతున్నాడు పాపం. మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం '' సరిలేరు నీకెవ్వరు '' . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి , దానికి తోడు టీజర్ కూడా ఆకట్టుకుంది అయితే అదే సమయంలో సరిలేరు నీకెవ్వరు నుండి రెండు పాటలు విడుదల అయినప్పటికీ అవి పెద్ద హిట్ మాత్రం కాలేకపోయాయి. రెండు కూడా సోసోగానే ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇదే సమయంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న అల ....... వైకుంఠపురములో చిత్రం లోని మూడు పాటలు విడుదల కాగా అందులో రెండు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఇక ఆ రెండు పాటలు కూడా యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తున్నాయి.
దాంతో ఈ విషయంలో మహేష్ బాబు కంటే అల్లు అర్జున్ పై చేయి సాధించాడని చెప్పొచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు చిత్రాలు కూడా ఒకరోజు తేడాతో విడుదల అవుతున్నాయి. జనవరి 11 న సరిలేరు నీకెవ్వరు , జనవరి 12న అల ..... వైకుంఠపురములో చిత్రాలు విడుదల అవుతున్నాయి. అల్లు అర్జున్ నుండి తీవ్ర పోటీ ఎదురు అవుతుండటంతో సవాల్ గా భావించిన మహేష్ ప్రమోషన్ లో కొత్త పుంతలు తొక్కేలా ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తుండగా అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.