బుట్ట బొమ్మ టీజర్ వచ్చేసింది

Published on Dec 23,2019 09:01 AM

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల ..... వైకుంఠపురములో చిత్రం లోని బుట్ట బొమ్మ పాట టీజర్ వచ్చేసింది. ఈనెల 24 న బుట్ట బొమ్మ పాటని విడుదల చేయనున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో బట్ట బొమ్మ సాంగ్ టీజర్ ని విడుదల చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మూడు పాటలను ఇంతకుముందే విడుదల చేయగా అందులో సామజవరగమన , రాములో రాములా పాటలు అద్భుతాన్ని ఆవిష్కరించాయి.

ఇక ఇప్పుడు బుట్ట బొమ్మ అనే పాట కూడా బాగానే ఉండేలా కనబడుతోంది , వినబడుతోంది. బుట్ట బొమ్మ పాట ఎలా ఉండబోతోందో తెలియజేస్తూ సాంగ్ టీజర్ విడుదల చేసారు. అది ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అల ...... వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 12 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.