లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్

Published on Jan 11,2020 11:31 AM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు సుకుమార్ సినిమాలో. గంధపు చెక్కల స్మగర్ గా అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో లారీ డ్రైవర్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. గంధపు చెక్కలను తన లారీ లో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు ముచ్చమటలు పట్టించే పాత్రలో దర్శనం ఇవ్వనున్నాడట. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే కొంతమంది కొత్తవాళ్ళని తీసుకున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా తీర్చి దిద్దాడు దర్శకులు సుకుమార్.

ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది , ఇక అల్లు అర్జున్ కొద్దిరోజుల తర్వాత ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఎందుకంటే అల వైకుంఠపురములో చిత్రం విడుదల అవుతోంది కాబట్టి. సుకుమార్ - అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు ఆర్య వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది అలాగే ఆర్య 2 కూడా వచ్చింది కానీ అది అంతగా ఆడలేదు. ఈ మూడో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని కసిగా ఉన్నారు అల్లు అర్జున్ - సుకుమార్ లు. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా కావడం విశేషం.