బ్లాక్ బస్టర్ కొట్టేసిన అల్లు అర్జున్

Published on Jan 12,2020 05:23 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సంక్రాంతి కానుకగా ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది అల వైకుంఠపురములో. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.   ఓవర్ సీస్ లో ఆల్రెడీ ముందుగానే షోలు పడటంతో ఆ టాక్ వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో విజయం సాధించింది ఈ కాంబినేషన్. 

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురములో చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో హ్యాట్రిక్ పరిపూర్ణం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. చాలావరకు అడ్వాన్స్ బుకింగ్ లు జరగడంతో రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వసూళ్లు వస్తున్నాయి. ఇక సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ చాలా సంతోషంగా ఉన్నారు