అల వైకుంఠపురములో సినిమా నిడివి ఎంతో తెలుసా ?

Published on Jan 08,2020 11:11 PM

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో చిత్రంగా వస్తోంది '' అల వైకుంఠపురములో ''. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా హాట్ భామ టబు కీలక పాత్రలో నటించింది. పూజా హెగ్డే తో అల్లు అర్జున్ రొమాన్స్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు డీజే దువ్వాడ జగన్నాధమ్ చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అయితే విజయం సాధించలేదు. అయితే మంచి వసూళ్ళని సాధించింది. కట్ చేస్తే ఇప్పుడు అల కోసం కలిశారు అల్లు అర్జున్ - పూజా హెగ్డే.

ఇక ఈ సినిమా నిడివి ఎంతో తెలుసా ....... 165 నిముషాలు. అంటే రెండు గంటల 45 నిమిషాల నిడివి అన్నమాట. ఇంత పెద్ద నిడివి అంటే ప్రేక్షకులు బోర్ ఫీలవ్వడం ఖాయం. సినిమా కనుక ఆకట్టుకునేలా ఉంటే మాత్రం ఈ నిడివి అనేది పెద్ద సమస్య కాదు కానీ సినిమా ఏమాత్రం బోర్ గా సాగిన తప్పకుండా దాని ప్రభావం పడుతుంది. జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠపురములో చిత్రం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈనెల 12న విడుదల అవుతున్న ఈ సినిమాకోసం అల్లు అర్జున్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.