అల్లు అరవింద్ కొడుకులు భయపడుతున్నారట!

Published on Dec 28,2019 12:17 PM

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కొడుకులు హీరో అల్లు అర్జున్ , అల్లు శిరీష్ , అల్లు బాబీ లు భయపడుతున్నారట ! ఈ ముగ్గురూ ఎందుకు భయపడుతున్నారో తెలుసా ........ ఎక్కడ తమ ఆస్తిని నాలుగు భాగాలు చేస్తాడో అని! అదేంటి అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు కదా ! మరి నాలుగు భాగాలుగా ఆస్తిని పంచడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నిర్మాత బన్నీ వాసు కూడా తనకు కొడుకు లాంటి వాడే అని పదేపదే అల్లు అరవింద్ చెబుతుండటమే ఇందుకు కారణం అట.

నాకు ముగ్గురు కొడుకులు కాదు బన్నీ వాసుతో కలిపి నలుగురు కొడుకులు అని వేదికల మీదే చెబుతున్నాడు అల్లు అరవింద్. అంతేకాదు నాకు బన్నీ వాసు కూడా కొడుకే అని చెబుతున్నందుకు ఎక్కడ ఆస్తిని నాలుగు భాగాలుగా చేస్తాడేమో అని నా ముగ్గురు కొడుకులు భయపడుతున్నారని కూడా చెప్పాడు దాంతో నవ్వుల పువ్వులు విరిశాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పలు హిట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు బన్నీ వాసు. దాంతో అతడు అంటే ప్రత్యేకమైన అభిమానం ఈ అగ్ర నిర్మాతకు. పైగా బన్నీ వాసు అల్లు అర్జున్ కు మంచి స్నేహితుడు కావడం విశేషం.