అల్లు అర్జున్ సినిమాపై వస్తున్నవన్నీ పుకార్లేనట

Published on Apr 27,2020 02:29 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఇదే సినిమాలో మలయాళ బ్యూటీ నివేదా థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అన్ని పుకార్లే అని కొట్టిపేసారు ఆ చిత్ర బృందం. మా సినిమాలో నివేద నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అందులో వాస్తవం లేదని ఖండించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ లను జరుపుకుంది. కేరళ లోని దట్టమైన అటవీప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇక ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. అల్లు అర్జున్ కు ఇది మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది.