డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ అలియా భట్

Published on Feb 08,2020 12:41 PM

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో చరణ్ సరసన నటిస్తున్న హాట్ భామ అలియా భట్ ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. మహేష్ భట్ చిన్న కూతురు అయిన అలియా భట్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో గత ఏడాదే పెళ్లి అవుతుందని వార్తలు వినిపించాయి కానీ ఈ ఏడాది డిసెంబర్ లో అలియా భట్ - రణబీర్ కపూర్ ల పెళ్లి కావడం ఖాయమని తెలుస్తోంది.

ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో తొలిసారిగా తెలుగు చిత్ర రంగానికి పరిచయం అవుతోంది అలియా భట్. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో అలియా భట్ నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక రణబీర్ కపూర్ - అలియా భట్ లు నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదల అవుతోంది. ఆ సినిమా విడుదల అయ్యాక వీళ్ళ పెళ్లి కానుందట.