చరణ్ సరసన అలియా భట్ ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్

Published on Mar 15,2019 04:00 PM

చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తోంది ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో . దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్ ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేసాడు జక్కన్న. 

ఇప్పటికే రెండు షెడ్యూల్ లు జరుపుకున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం తాజాగా మూడో షెడ్యూల్ కోసం కోల్ కతా లో జరుగనుంది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు జక్కన్న.