అలీ కూతురు కూడా సినిమాల్లోకి వస్తోంది

Published on Mar 10,2020 08:15 PM

హాస్య నటుడు అలీ కూతురు కూడా సినిమాల్లోకి వస్తోంది. అలీ కూతురు అనగానే పెద్దమ్మాయి హీరోయిన్ గా వస్తోందా ? అని అనుకోవద్దు చిన్నమ్మాయి జువేరియా బాలనటిగా ఎంట్రీ ఇస్తోంది. అలీ కూడా బాల నటుడిగానే సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు అగ్రశ్రేణి హాస్య నటుడిగా మారాడు అలీ. తాజాగా మా గంగానది అనే చిత్రం రూపొందుతోంది.

ఆ చిత్రంలో అలీ లాయర్ గా నటిస్తుండగా అలీ చిన్న కూతురు జువేరియా బాలనటిగా కీలక పాత్రలో నటిస్తోంది. మహిళల సమస్యలపై రూపొందుతున్న సినిమా మా గంగానది. కాగా ఈ సినిమాలోనే తండ్రి కూతురు ఇద్దరు కలిసి నటించడం విశేషం. అలీ కి ముగ్గురు సంతానం కాగా అందులో ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. చిన్న కూతురు బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఇక కొడుకు ఎప్పుడు వస్తాడో ?