అల ..... వైకుంఠపురములో టీజర్ ఎప్పుడో తెలుసా ?

Published on Sep 07,2019 11:23 AM

అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న అల ...... వైకుంఠపురములో టీజర్ ని సిద్ధం చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఇంతకీ ఈ సినిమా టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా ......... నవంబర్ 7 . ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా  ....... దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. నవంబర్ 7 న త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో ఆరోజున అల వైకుంఠపురములో టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
2020 జనవరిలో సినిమాని విడుదల చేయనున్నారు దాంతో నవంబర్ లో టీజర్ రానుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో సీనియర్ నటి టబు , మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ '' అల వైకుంఠపురములో '' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టైటిల్ పట్ల , అల్లు అర్జున్ లుక్ పట్ల మంచి స్పందన వచ్చింది.